కరువైన శుభ్రత, నాణ్యత..
జిల్లాలో చాలా హోటళ్లు శుభ్రత, నాణ్యత అనేవి ఎప్పుడో మరిచిపోయాయి. ఏ హోటల్‌ను పరిశీలించినా వాటి పరిసరాలు కంపుకొడుతుంటాయి. కనీసం డ్రెయినేజీ సౌకర్యం కూడా లేకుండానే కొన్ని రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. గ్రిల్ నైన్ హోటల్‌కు సైతం డ్రెయినేజీ లేదు. వెనుకభాగంలో ఏఎన్‌రెడ్డి కాలనీలోకి మురికినీటిని వదిలేస్తున్నారు. దీంతో పలుమార్లు ఈ కాలనీవాసులు మున్సిపల్, కలెక్టరేట్‌ల వరకూ వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ సదరు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఘటన నేపథ్యంలో వారిపైనా విమర్శలు వస్తున్నాయి. హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వాడే పాత్రలు, స్టవ్‌లను కూడా శుభ్రం చేయకుండానే వాటిపైనే రోజూ వండుతున్నారు. అసలు చాలా హోటళ్లలో వంటగదులను చూస్తే.. ఇక బయట భోజనాలు కూడా చేయరు.. అలా ఉంటాయి. శుభ్రతతో పాటు నాణ్యతనూ పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment