నిర్మల్: జిల్లాలో ప్రత్యేక ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించామని డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. ఈనెల 2న పాఠశాల విద్యాశాఖ సంచాలకుల నుంచి వచ్చి న ఆదేశాలు, పంపిన జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 23 ఎస్జీటీ పోస్టులకు రెండు ఉర్దూ మీడియం పోస్టులు ఉండగా, తెలుగు మీడియంలో 21 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు మీడియం పోస్టులకు సంబంధించి 15 మంది అర్హులు కాగా, రోస్టర్ ప్రకారం 14 మందికి పోస్టింగ్ ఇచ్చామన్నారు. ఏడు పోస్టుల కేటగిరీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున మిగిలాయన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులు లేనందున రెండు పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ ఐదు పోస్టులు ఉండగా, అర్హులైన ఐదుగురు అభ్యర్థులను నిబంధనల ప్రకారమే భర్తీ చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment