నిర్మల్
శిక్షణాధికారుల క్షేత్ర పర్యటన
శిక్షణలో ఉన్న 29 మంది ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జామ్ గ్రామంలో పర్యటించారు. అధికారుల బాధ్యతలు, విధుల గురించి వీరు తెలుసుకున్నారు.
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
‘కాంగ్రెస్‌ది పక్షపాత ధోరణి’
భైంసాటౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలపై పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రధానికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పక్షపాత వైఖరి అవలంభిస్తోందని, నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలని కోరారు. చదువుల తల్లి కొలువైన బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. సీఎస్‌ఆర్ నిధులు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రామారావుపటేల్ పేర్కొన్నారు.
పోలీసులకు ఎదురుగా వెళ్తున్న దిలావర్‌పూర్, గుండెపల్లి గ్రామాల ప్రజలు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment