● రెండోరోజూ కొనసాగిన ఆందోళన ● మళ్లీ ఎన్‌హెచ్–61పై బైఠా
నిర్మల్/దిలావర్‌పూర్: ‘ఫ్యాక్టరీ వద్దంటే వద్దు..’ అంటూ పట్టుబట్టిన ఆ ఊళ్లు ఎట్టకేలకు గెలిచాయి. పిల్లాజెల్లా.. ముసలి.. ముతకా అనే తేడా లేకుండా ఒకేమాటపై నిలిచి, పోరుబాటలోనే నడిచి సర్కారు నే ఒప్పించారు. ఊళ్లను కాపాడుకోవాలన్న వీళ్ల ఆ రాటం రెండురోజులుగా పోరాటంలా సాగింది. చి వరకు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలకు తాళాలు వేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. ఓ దశలో ఆర్డీ వో రత్నకల్యాణి ఘెరావ్, ఆమె వాహనంపై దాడి, మరుసటిరోజు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వీరి పోరు అదుపు తప్పుతుందేమో.. ఇక పచ్చని పల్లెల్లో లాఠీచార్జీలు, భాష్పవాయు ప్రయోగాలు తప్పవే మో అన్నంత సీరియస్ వాతావరణం నెలకొంది. కానీ.. ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రంగంలోకి ది గి తీసుకున్న నిర్ణయాలు, ఆమె ఇచ్చిన ఆదేశాలు, మంత్రి సీతక్క, ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించిన తీరు.. అంతటిపోరు శాంతియుతంగానే ము గిసేలా చేశాయి. కలెక్టర్ అభిలాషఅభినవ్ ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారమివ్వడం, ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేసేలా చూడాలని చెప్పడం, గ్రామస్తులతో చర్చలు జరపడంలో సఫలమయ్యారు. స ర్కారే హామీ ఇవ్వడం, జిల్లా ఉన్నతాధికారులిద్దరూ భరోసాగా నిలవడంతో ఆ ఊళ్లన్నీ చల్లబడ్డాయి.
నిలిచి గెలిచిన గ్రామాలు
ఇథనాల్ ఫ్యాక్టరీని తమ ఊళ్ల మధ్యలో నుంచి తరలించేదాకా తగ్గేదిలేదని దిలావర్‌పూర్, గుండంపల్లి డిసైడ్ అయ్యాయి. వారి పోరులో సమీపంలోని స ముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం, బన్సపల్లి తదితర గ్రామాలూ భాగమయ్యాయి. ఈక్రమంలో మంగళవారం ఉధృతం చేసిన పోరును, బుధవా రం కొనసాగించారు. తమ ఊళ్లల్లోకి వచ్చి యువకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులను గుండంపల్లి, దిలా వర్‌పూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. మండలకేంద్రంలో రాస్తారోకో కోసం తరలుతున్న గ్రామస్తుల ను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రు వ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీ సులు వెళ్లిన తర్వాత యథావిధిగా రెండోరోజూ ది లావర్‌పూర్ బస్టాండ్ వద్ద భారీ సంఖ్యలో 61వ జా తీయరహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం ఇచ్చి న హామీని జిల్లా అధికారులు ప్రకటించేదాకా రోడ్డుపైనే వంటావార్పు చేశారు. ఎన్‌హెచ్ 61పై నుంచి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.
కార్యాలయాలకు తాళాలు
ఇథనాల్ పోరుపై ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా ‘లగచర్ల’లో కలెక్టర్‌పై దాడి జరిగిన ఘటన ప్రభావం చూపింది. ఇక్కడా అధికారులపై దాడుల జరిగే అవకాశాలు ఉండటం, మంగళవారం ఆర్డీవోను గంటలపాటు ఘెరావ్ చేయడంతో కలెక్టర్ ఘటనా స్థలానికి రాలేదు. మరోవైపు బుధవారం ముట్టడికి వస్తారన్న సమాచారం ఉండటంతో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను మధ్యాహ్నం నుంచి మూసి ఉంచారు. సేవలు, పనులను నిలిపివేసి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ముందుగానే పంపించారు. ఆర్డీవో కార్యాలయానికి ఏకంగా తాళం వేసేశారు.
కలెక్టరేట్‌లో చర్చించి..
జిల్లాలో ఇథనాల్ పోరు సమాచారాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తూ వచ్చారు. ఇదేక్రమంలో బుధవారం పరిస్థితులు అంచనా వేసిన ప్రభుత్వం ఫ్యాక్టరీ పనుల నిలిపివేతకు నిర్ణయించింది. రైతులు, గ్రామాలకు ఇబ్బందులను కలిగించేలా ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు కలెక్టర్ అభిలాషఅభినవ్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి ఆయా గ్రామాల రైతులు, పెద్దలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించారు. ఈమేరకు సదరు గ్రామస్తులు పూర్తిగా తమ ఊళ్ల మధ్యలో నుంచి ఫ్యాక్టరీని తొలగించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందన్న హామీ లభించడంతో తాత్కాలికంగా తమ ఆందోళనను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇదే విషయాన్ని చెప్పడానికి దిలావర్‌పూర్‌కు వెళ్లిన ఎస్పీ జానకీషర్మిలకు వారంతా ఘనస్వాగతం పలికారు. ఎక్కడైతే రాళ్లదాడి చేశారో.. అదే మండలకేంద్రంలో పూలతో స్వాగతం పలుకుతూ ‘ఎస్పీ జిందాబాద్..’ అనడం విశేషం. ఈసందర్భంగా ఎంతటి సమస్య ఉన్నా సంయమనం పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల ఆయా గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు.
కల్లూరులో ట్రాఫిక్ జామ్
కుంటాల: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ నిర్మల్–భైంసా 61వ జాతీయ రహదారి దిలావర్‌పూర్ వద్ద బుధవారం రెండోరోజు రైతులు బైఠాయించారు. దీంతో నిర్మల్‌కు వెళ్లే భారీ వాహనాలు కల్లూరు సమీపంలో నిలిచిపోగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కల్లూరు నుంచి వెళ్లే బస్సులు ఆపకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సై భాస్కరాచారి ఆధ్వర్యంలో పోలీసులు కల్లూరు నుంచి కుంటాల మీదుగా వాహనాలు నిర్మల్‌కు వెళ్లే ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment