మామడ: మండలంలోని పొన్కల్ రైతువేదికలో బుధవారం స్పైసిస్ బోర్డు రీజినల్ అధికారి సుదర్శన్ పసుపు రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, పంటకు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్ అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీపై పసుపు ఉడికించే యంత్రాలు, టార్పాలిన్లు అందిస్తామని తెలిపారు. పొన్కల్ ప్రాంతంలో పసుపు సాగు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పసుపు ఉత్పత్తిదారుల సంఘ ఏర్పాటుకు రైతులతో చర్చిస్తామని ఏఈవో సంతోష్‌కుమార్ తెలిపారు. స్పైసిస్ బోర్డు అధికారి మాధవ్, అవని ఫౌండేషన్ ఎన్జీవో తలారి రాణి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment