రేపటి నుంచి నిర్వహించనున్న జాతరకు కుభీర్‌లోని విఠలేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 22నుంచి ఆలయంలో తాళ సప్తాహం ప్రారంభమైంది.
‘ఖాకీ’ విజయం..
9లోu
ఓవైపు తమపై రాళ్లు రువ్వుతున్నా.. కనీసం లాఠీ ఎత్తకుండా ‘వాళ్లు మనోళ్లేనయ్యా.. పదండి..’ అంటూ ఎస్పీ మేడమ్ ఇచ్చిన ఆదేశాలతో ఖాకీలు తలవంచుకుని వెళ్లిపోయారు. ఆ క్షణంలో పోలీసులు పాటించిన సంయమనం ఇథనాల్ పోరు హింసాత్మకంగా మారకుండా శాంతియుతంగా ముగింపు పలికేలా చేసింది. ఒకవేళ అప్పుడే లాఠీచార్జీ, భాష్పవాయు ప్రయోగాలు చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. అక్కడ చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉండటంతో ఎస్పీ జానకీషర్మిల ఎలాంటి ప్రతిఘటన చేయవద్దంటూ తమ బలగాలను వెనక్కి తీసుకెళ్లి శాంతియుత ముగింపులో కీలకమయ్యారు. ఆందోళన తొలిరోజైన మంగళవారం కూడా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. తన వాహనంలోనే గంటలపాటు చిక్కుకుపోయి అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని బయటకు తీసుకురావడానికి ఎస్పీ స్వయంగా ఆందోళన చేస్తున్న మహిళల మధ్యలోకి చొచ్చుకువెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చి నిర్మల్‌కు పంపించడం గమనార్హం. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సీఎం వరకూ తీసుకెళ్లేందుకు ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో మాట్లాడటం, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు రిపోర్టు చేయడంలోనూ ఎస్పీ సఫలీకృతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment