ఆశాజనకంగా ‘కడెం’
త్వరలో నిర్ణయిస్తాం
గతేడాది కంటే ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. యాసంగి సాగునీటి విడుదలపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయకట్టు రైతాంగంతో త్వరలోనే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. – నవీన్, డీఈ, కడెం ప్రాజెక్ట్
రెండో పంటకు నీరిస్తాం
‘కడెం’ ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9.20 కోట్లతో చేపట్టిన మరమ్మతుల కారణంగా ఈ ఏడాది వానాకాలంలో ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నీటిమట్టం ఆశాజనకంగా ఉన్నందున రెండో పంటకు సాగునీరు అందిస్తాం. ‘ప్రాజెక్ట్’ను పూడికతీత ఎంపిక చేయడం హర్షణీయం.
– వెడ్మ బొజ్జు పటేల్,
ఖానాపూర్ ఎమ్మెల్యే
కడెం: గతేడాది కడెం ప్రాజెక్ట్‌లో నీళ్లు లేక రెండోపంట సాగు చేయలేదు. దీంతో వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూడికతీతకు ఎంపికచేయగా ఆయకట్టుకు సాగు నీరిస్తారా? లేదా? అని రైతులు అయోమయంలో పడ్డారు.
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. గతేడాది నవంబర్ 27న, ప్రాజెక్ట్ నీటిమట్టం 682.700, ప్రస్తుతం 695.175 అడుగులుగా ఉంది. దీంతో ఆ యకట్టు రైతుల్లో యాసంగి సాగుపై ఆశలు చిగురి స్తున్నాయి. ఆయకట్టు కింద కడెం, దస్తురాబాద్, జ న్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా వానాకాలంలో సుమారు 68,150 ఎకరాలు సాగయ్యాయి. యాసంగిలో సుమారు 25వేల ఎకరాలు సాగవుతా యి. ఆయకట్టు కింద ప్రధానంగా వరి సాగు అధి కం. పసుపు, పత్తి, మక్క కూడా సాగు చేస్తుంటారు. రెండు పంటకు సాగు నీరందించే కడెం ప్రాజెక్ట్‌లో గతంలో నీరు నిల్వ లేక అధికారులు యాసంగికి నీ టిని విడుదల చేయలేదు. దీంతో ఆయా మండలా ల్లో వ్యవసాయ బావులు, బోర్లున్న రైతులే పంటలు సాగు చేశారు. వేల ఎకరాలు బీళ్లుగా మారాయి.
పూడికతీతపై అయోమయం
కడెం ప్రాజెక్ట్‌లో పేరుకుపోయిన పూడిక తీస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పూడిక తీ సేందుకు ఇందులోని నీరు ఖాళీ చేస్తారా? రెండో పంటకు ఇవ్వరా? అని ఆయకట్టు రైతాంగం అయోమయంలో ఉంది. పూడికతీతకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన ‘కడెం’లో పూడిక ఎంత మేర ఉందో.. హై డ్రాలజీ సర్వే చేయాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్ట్ పూడికతీత విషయమై నివేదికలను అధికారులు నీటి పారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి అందజేశారు. పూడికతీతకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఖరారు చేయడం, సర్వేకు ఇంకా సమయం పట్టనున్నట్లు సమాచారం.
నీటితో కళకళలాడుతున్న ప్రాజెక్ట్
యాసంగిపై అన్నదాతల ఆశలు
‘పూడికతీత’పైనే స్పష్టత కరువు
కడెం ప్రాజెక్ట్ సమాచారం
పూర్తిస్థాయి సామర్థ్యం: 700 అడుగులు
గతేడాది నిల్వ: 682.700 అడుగులు
ప్రస్తుత నిల్వ: 695.175 అడుగులు
వానాకాలం సాగు విస్తీర్ణం: 68,000
యాసంగి సాగు విస్తీర్ణం: 25,000
Comments
Please login to add a commentAdd a comment