వాతావరణం
ఆకాశం పాక్షికంగా, అప్పుడప్పుడు పూర్తిగా మేఘావృతమవుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది.
ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
మామడ: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు సూచించారు. బుధవారం మామడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రతీరోజు పాఠశాలకు హాజరు కావాలని, ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాల్లో సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, పరిసరాలు, తాగునీటి వసతిని పరిశీలించారు. పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎస్వో సలోమి కరుణ, లింబాద్రి, ఉపాధ్యాయులున్నారు.
పాఠశాల తనిఖీ
కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి వచ్చిన ఆయన హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల సిలబస్ పురోగతిపై సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో సమావేశమై వార్షిక పరీక్షలపై సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట సెక్టోరల్ అధికారులు, సలోమి కరుణ, లింబాద్రి, ఎంఈవో షేక్ హుస్సేన్, సిబ్బంది ఉన్నారు.
భైంసాటౌన్: పట్టణంలోని సుభద్రవాటిక సరస్వతి శిశుమందిర్ పాఠశాలను డీఈవో రామారావు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా శ్రద్ధతో చది వితే వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించవచ్చని తెలిపారు. ఆయన వెంట ఎంఈవో సుభా ష్, హెచ్‌ఎం దేవేందర్, ఉపాధ్యాయులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment