అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment