ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని గణేష్‌పూర్‌కు చెందిన చిక్రం అర్జున్ (19) రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. టూటౌన్ ఏఎస్సై ముకుంద్‌రావు కథనం ప్రకారం..అర్జున్ గత కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన ఏ ప నిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో కుటుంబీకులు మందలించడంతో గతనెల 28న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొన్నారు.
బైక్ దొంగ అరెస్ట్
బోథ్: మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి బైక్ ఇటీవల చోరీకి గురైంది. మండల కేంద్రానికి చెందిన బైక్ దొంగ వి ష్ణును మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు న మోదు చేసి విష్ణును రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
నేడు, రేపు సీసీఐ కొనుగోళ్ల నిలిపివేత
భైంసాటౌన్: పట్టణంలో బు ధ, గురువారాల్లో సీసీఐ కొనుగోళ్లు నిలిపేస్తున్నట్లు ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు జరుపడం లేదని పేర్కొన్నారు. 3వ తే దీన కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment