బాలల సంరక్షణకే ఆపరేషన్ స్మైల్
నిర్మల్‌ఖిల్లా: బాలల సంరక్షణకే ఆపరేషన్ స్మై ల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆపరేషన్ స్మైల్ ఇన్‌చార్జి, సబ్ ఇన్‌స్పెక్టర్ సాధిక్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమీపంలోని ఐకే రెడ్డి చౌరస్తా సమీపంలోగల మెకానిక్ షాపులో సోదాలు నిర్వహించి ఇద్దరు మైనర్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలల్లో చేర్పించారు. మైనర్లను పనిలో పెట్టుకున్న అజీజ్‌పై కేసు నమోదు చేశామన్నారు. బాలల పరిరక్షణ అధికారులు నరేందర్, రాజు, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ జమీర్, కానిస్టేబుల్‌లు ముత్యం, నరేశ్, వజ్రమ్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment