జిల్లాపై ఎస్పీ తనదైన ముద్ర
నిర్మల్‌టౌన్: ఎస్పీగా జానకీ షర్మిల జిల్లాకు వ చ్చి నేటితో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కా లంలో ఆమె జిల్లాపై తనదైన ముద్ర వేసుకుని ప్రత్యేకతను చాటుకున్నారు. ‘నిర్మల్ పోలీస్.. మీ పోలీస్’ అనే నినాదంతో ప్రజలకు చేరువయ్యారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. ము ఖ్యమైన మైలురాళ్లు దాటారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, భరోసా సెంటర్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, తప్పిపోయిన పిల్లలను రక్షించడానికి ఆపరేషన్ ముస్కాన్ ఇలా ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించారు. కడెం ప్రాజెక్ట్ సమీపంలో వరద రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించారు. అన్ని వర్గాలవారి పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా జాగ్రత్తపడ్డారు.
ఎస్పీ చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని..
యూబిట్ కాయిన్‌తో కూడిన పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీ స్కామ్‌ను వెలికి తీశారు. జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి నిర్మూలనకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవలే మంగళ్‌సింగ్ తండాలో సాగు చేస్తున్న రూ.70 లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేయించారు. గంజాయిని అరికట్టేందుకు విద్యాసంస్థల్లో యాంటీ నార్కోటిక్స్‌పై అవగాహన కల్పించా రు. నిరంతరం పోలీస్ జాగిలాలతో అనుమానా స్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. బా సర గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యలను ని వారించడానికి అక్కడ బ్లూకోల్ట్స్ సిబ్బందిని ని యమించారు. వంతెన గోడ ఎత్తు లేపేందుకు అధికారులతో చర్చించారు. గణేశ్, దుర్గా నవరా త్రోత్సవాలు, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ తదితర పండుగలను ప్రశాంతంగా జరుపుకొనేలా అన్ని రకాల చర్యలు చేపట్టారు. దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన పోరాటంలో ఎస్పీ కీలకంగా వ్యవహరించారు. సమయస్ఫూర్తితో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా పరిస్థితిని శాంతియుతంగా, నియంత్రణలో ఉండేలా చక్కదిద్దగలిగారు. ‘డయల్ 100’పై ఆమె తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతోమంది రక్షించబడ్డారు. వేధింపుల నుంచి విముక్తి కలగడానికి మహిళల కోసం నిర్మల్‌లో భరోసా సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 52 జంటలకు పునరావాసం కల్పించారు. గత మార్చిలో అందరికీ నాణ్యమైన, కచ్చితమైన కొలతలతో పెట్రోల్, డీజిల్ అందించేందుకు వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. బాసర ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో తరచూ జరిగే విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆమె కళాశాలను దత్తత తీసుకుని పరివర్తన చర్యలు ప్రారంభించారు.
ప్రజల సహకారంతోనే..
ఏడాది కాలంలో జిల్లా ప్రజలకు దగ్గరయ్యాను. సామాన్యులు కూడా నా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకొనే స్వేచ్ఛ, నమ్మకం కలిగించాను. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూశాను. జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్, భరోసా సెంటర్లు ప్రారంభించాం. ఈ సంవత్సరం ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడతా. సహకరించిన జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు.
– జానకీ షర్మిల, ఎస్పీ
జానకీ షర్మిల వచ్చి నేటికి ఏడాది
యూబిట్ కాయిన్ స్కామ్ వెలికితీత
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ
‘ఇథనాల్’ వ్యవహారంలో కీలకపాత్ర
బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాల దత్తత
Comments
Please login to add a commentAdd a comment