కొనసాగుతున్న పారాయణం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని శాసీ్త్రనగర్‌లోగల అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం రెండోరోజు సాయి పారాయణం కొనసాగింది. ముందుగా షిర్డీకి చెందిన వికాస్‌రాజ్ ఆధ్వర్యంలో సాయి పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు సాయిబాబా భిక్షాటన తీరు, బైజాబాయి బాబాకు చేసిన సేవ తదితర విషయాలను వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, సాయి సచ్చరిత్ర రచయిత హేమాఢ్ పంత్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment