వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రివేళ మంచు కురుస్తుంది.
రోడ్డు భద్రతపై
అవగాహన కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రజలందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించా రు. శనివారం హైదరాబాద్ నుంచి రవాణాశా ఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఇత ర అధికారులతో కలిసి రోడ్డు భద్రత మాసో త్సవాల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, రవా ణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలపై పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతి క కార్యక్రమాలు, వ్యాసరచన, ఉపన్యాస పో టీలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో రో డ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా ని ర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎ స్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ప్రాంతీయ రవాణాధికారి దుర్గాప్రసాద్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, ఎంవీఐ మహేందర్, డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్, నిర్మల్ డీఎం ప్రతిమారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా
లూయిస్ బ్రెయిలీ జయంతి
నిర్మల్‌చైన్‌గేట్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని అ దనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జ యంతిని సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ బ్రెయిలీ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు అంధులతో కలిసి అదనపు కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపి కనుగొనడంతో అంధులూ విద్య నేర్చుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన కృషితోనే అనేక రంగాల్లో భాగస్వాములవుతున్నారని చెప్పారు. అంధులు నిరాశ చెందకుండా బ్రెయిలీ లిపిని నేర్చుకుని జీవితంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఏసీడీపీవో నాగలక్ష్మి, సీడీపీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment