మల్చింగ్ సాగు.. బాగు
● 50శాతం సబ్సిడీతో ప్రోత్సాహం ● ఆసక్తి చూపుతున్న అన్నదాతలు
మామడ: ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల తోటలను మల్చింగ్ విధానంలో సాగు చేస్తున్న రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మల్చింగ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తోంది. ఎకరాకు రూ.6,400 సబ్సిడీ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఉద్యాన పంటలను మల్చింగ్ విధానంలో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సాగు విధానం ఇలా..
పంట సాగు చేసిన తర్వాత మొక్కల చుట్టూ వేరు భాగాన్ని కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. బిందుసేద్యం, మల్చింగ్ ద్వారా పంటలు సాగు చేస్తూ రైతులు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పద్ధతిలో జిల్లాలో రైతులు కూరగాయలు, పూలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో 50 హెక్టార్లలో రైతులు మల్చింగ్ పద్ధతిలోనే సాగు చేస్తున్నా రు. ఈ పద్ధతిలో మొక్కలకు ఇరువైపులా 5నుంచి 10 సెంటీమీటర్ల లోతులో గాఢలు చేయాలి. మ ల్చింగ్‌షీట్ చివరలు గాఢలో ఉండేలా చూడాలి.
సాగుతో లాభాలివి..
మల్చింగ్ విధానంలో పంటల సాగు ద్వారా మొక్క చుట్టూ తేమ ఆవిరి కాదు. కలుపు మొక్కలు రాకుండా చేస్తుంది. 30నుంచి 40 శాతం సాగునీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి చేరకపోవడంతో కలుపు మొక్కలు నివారించబడతాయి. మల్చింగ్ సాగులో ఉన్న పంట పొలంలో వర్షం కురిసినపుడు మల్చింగ్ షీట్ కారణంగా నేరుగా భూమిపై పడకపోవడంతో మట్టికోతకు గురికాకుండా ఉంటుంది. పంటల భూ సారం పరిరక్షించబడుతుంది. మల్చింగ్ పద్ధతి ద్వా రా నేలలో ఉష్ణోగ్రత నియంత్రించడంతో పాటు భూమిలోపల ఉన్న క్రిమికీటకాలు, తెగుళ్లను ని యంత్రిస్తుంది. నేల నిర్మాణం వృద్ధి చెంది మొక్కల కు పోషకాలు అందడంతో దిగుబడులు పెరుగుతా యని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గుతుంది. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment