నిర్మల్
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 290 బస్సులు నడపనుంది.
ఇంటి పనులు అడ్డుకున్నారని..
ఇంటి నిర్మాణ పనులను మున్సిపల్ అధికా రులు అడ్డుకున్నారని జిల్లా కేంద్రానికి చెంది న ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు.
ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
ముస్తాబవుతున్న వేదిక
నిర్మల్: ‘రండి...
నిమ్మనాయుడు మురిసిపోయేలా..
రాంజీగోండు మీసం మెలేసేలా..
చదువులమ్మ మనసారా దీవించేలా..
‘బాదనకుర్తి బౌద్ధం’ విలసిల్లేలా..
‘కడెం కుండ’ గుండెచప్పుడు వినిపించేలా..
మైసా తెల్లబంగారం మెరిసిపోయేలా..
కొయ్యబొమ్మ కలకాలం కొలువుండిపోయేలా..
మనదైన చరిత్రను కొత్తగా చెబుదాం. మనకే సొంతమైన సంస్కృతిని సరికొత్తగా చాటుదాం. మనవైన వంటకాలను మళ్లీ పరిచయం చేసుకుందాం. మొత్తం మీద మూడురోజుల పండుగను సంబురంగా సాగిద్దాం.. రారండోయ్..’అంటూ ‘నిర్మల్ ఉత్సవాలు’ పిలుస్తున్నాయి. నేటి నుంచి మూడురోజుల పాటు సాగే ఈ వేడుకలు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో స్టాళ్లు, స్టేజీలు, లైటింగ్ సహా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లా ప్రజలందరి భాగస్వామ్యంతో ‘నిర్మల్ ఉత్సవాలు’ విజయవంతం చేద్దామంటూ అధికారయంత్రాంగం పిలుపునిస్తోంది.
లక్ష్మణచాంద
ఎంపీడీవోకు అవార్డు
లక్ష్మణచాంద: స్థానిక ఎంపీడీవో రాధ శనివారం సావిత్రిబాయి పూలే 2025 ఐకాన్ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో గ్రామీణ ప్రజలకు సేవలందించినందుకు, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేసినందుకు ఎంపీడీవోకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ నిర్వాహకులు ఈ అవార్డు అందజేశారు.
మనవైన ఘుమఘుమలు..
వేడివేడి పిట్లా జొన్నరొట్టె తింటే.. ఎవ్వరైనా ఆహా అనాల్సిందే. భైంసా కలామ్ ఒక్కటి నోట్లో వేసుకుంటే ఎదుటోళ్లకు నోరూరాల్సిందే. ఎల్లిపాయ నూరి చేసిన కారంపూసను ఎక్కడివారైనా టేస్ట్ చేయాల్సిందే. ఇక జలసిరులున్న జిల్లాలో పెరిగిన మత్స్యసంపదతో చేసే చేపపచ్చళ్లు, వేపుళ్లు, పులుసులు వాసనతోనే చెవులూరించాల్సిందే. ఇలాంటి ఎన్నో మనవైన ఘుమఘుమలను నిర్మల్ ఉత్సవాలు అందించనున్నాయి. వేడుకలకు వచ్చిన వారందరికీ మన లోకల్ టేస్ట్ చూపించనున్నాయి.
చరిత్రను చాటేలా..
నిర్మల్ ఉత్సవాల్లో ప్రధానాంశం చరిత్ర. మూడురోజుల పాటు సాగే వేడుకల్లో ప్రతిరోజూ నిర్మల్‌తో పాటు జిల్లా చరిత్రపై కచ్చితంగా కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేశారు. రోజూ సాయంత్రం చారిత్రక అంశాల ప్రదర్శనలతోపాటు అనుభవజ్ఞులు, పరిశోధనలు చేసినవారితో జిల్లా ఘనమైన గతాన్ని ప్రస్తుత తరానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
సంస్కృతి ప్రతిబింబించేలా..
గట్ల (సహ్యద్రి ఘాట్ల) కింద, గంగ ఇవతల (గోదావరికి ఇటువైపు) ఉన్న నిమ్మలకు తనదైన సంస్కృతి ఉంది. మహారాష్ట్రతో దాదాపు ఓ వైపంతా హద్దు కలిగి, మరోదిక్కు మంచిర్యాలతో అనుబంధం కలుపుకొని ఉంది. గంగ దాటితో నిజామాబాద్, గట్లు ఎక్కితే ఆదిలాబాద్ ఇలా.. నలువైపులా విభిన్న సంస్కృతులున్నాయి. వాటికి భిన్నంగా నిమ్మల తన పేరును నిలుపుకొంటోంది. చుట్టుపక్కల ఎక్కడా లేనివిధంగా తనకే సొంతమైన చారిత్రక వారసత్వాన్నీ కలిగి ఉంది. ఈ సాంస్కృతిక వారసత్వాన్నీ నేటి తరానికి అందించాలన్న ఉద్దేశం ఈ ఉత్సవాల్లో దాగి ఉంది. ఈమేరకు కవులు, కళాకారులు, విద్యార్థుల ద్వారా కార్యక్రమాలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
న్యూస్‌రీల్
చరిత్రను కొత్తగా చెబుదాం
సంస్కృతిని చాటుకుందాం
మన వంటకాలను ఆస్వాదిద్దాం
జిల్లాలో కొత్త ట్రెండ్ సెట్‌చేద్దాం
నేటి నుంచే ‘నిర్మల్ ఉత్సవాలు’
నిర్వహణ కోసం సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment