భైంసాలో ఖేల్‌ఖూద్ పోటీలు
భైంసాటౌన్: పట్టణంలోని పులేనగర్‌లోగల సరస్వతి శిశుమందిర్‌లో శనివారం జిల్లాస్థాయి ఖేల్‌ఖూద్ పోటీలు నిర్వహించారు. ఎంపీ గోడం నగేశ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, దివంగత దిగంబర్ మాశెట్టివార్ శిశుమందిరాలకు విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్‌రెడ్డి, పూర్వవిద్యార్థి పరిషత్ అధ్యక్షుడు హరిస్మరణ్‌రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, పాఠశాల ప్రబంధకారిణి సభ్యుడు రమేశ్ మాశెట్టివార్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ సుభద్ర నిలయంలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర కాలెండర్‌ను ఎంపీ గోడం నగేశ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ఆవిష్కరించారు. తపస్ నాయకులు నవీన్‌కుమార్, రాజేశ్వర్, నాగాచారి, దేవేందర్, హన్మాండ్లు, గంగాధర్, నరేశ్, వెంకట్‌రమణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment