హమాలీల వేతనాలు పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: సివిల్ సప్లయ్ హమాలీ కార్మికుల వేతనాల ఫైనల్ జీవోను వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సివిల్ సప్లయ్ హమాలీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆయన శనివారం పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కే లక్ష్మి, సీపీఐ సీనియర్ నాయకుడు ఎస్‌ఎన్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు ఫయాజ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. వెంటనే సివిల్ సప్లయ్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయి, పుండలిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment