విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో శనివారం సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షాపత్రాలను డీఈవో రామారావు, ఏసీజీ సిద్ధ పద్మ, అధికారులు విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. నూతనంగా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు, కొత్త డీఎస్సీ ద్వారా నియమితులైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు.
విజేతలు వీరే..
తెలుగు మీడియంలో కొట్టే హర్షవర్ధన్ ప్రథమ (జెడ్పీహెచ్‌ఎస్, మస్కాపూర్), బీ కీర్తి ద్వితీయ (జెడ్పీహెచ్‌ఎస్, మస్కాపూర్), రాచకొండ రాజు తృతీయ (జెడ్పీహెచ్‌ఎస్, జామ్), ఇంగ్లిష్ మీడియంలో మైసా నందిని ప్రథమ (జెడ్పీహెచ్‌ఎస్, మస్కాపూర్), విశ్వంత్ ద్వితీయ (జెడ్పీహెచ్‌ఎస్, కొరిటికల్), అజయ్‌కుమార్ తృతీయ (జెడ్పీహెచ్‌ఎస్, లక్ష్మణచాంద), ఉర్దూ మీడియంలో సయ్యద్ దోస్త్ ప్రథమ (జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్, నిర్మల్), సనా బేగం ద్వితీయ (జెడ్పీహెచ్‌ఎస్ గర్‌ల్స్, నిర్మల్), రిమ్స్ బేగం తృతీయ (జెడ్పీహెచ్‌ఎస్, ఖానాపూర్) స్థానాల్లో గెలుపొందారు. వీరికి ఫోరం ఆధ్వర్యంలో నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఫోరం అధ్యక్షుడు రాపర్తి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి భూషణ్, ఆంజనేయులు, నకిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్పీ నాగరాజు, వినోద్‌కుమార్, శేఖర్, శ్రీనివాస్, సిలారి మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment