హమాలీ కార్మికులకిచ్చిన హామీని అమలు చేయాలి
ఖానాపూర్: సివిల్ సప్లయ్ హమాలీల కూలి రేట్లు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఎదుట సివిల్ సప్లయ్ హమాలీలు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి మాట్లాడారు. మూడు నెలల పెండింగ్ కూలి డబ్బులు విడుదల చేయాలని, హమాలీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేశ్‌నాయక్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసాచారి, నాయకులు ఎల్‌ఆర్ ఉపాలి, కడుకుంట్ల రవి, పిట్టల భీమేశ్, చిన్నయ్య, నర్సయ్య, భూమారెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment