మెరుగైన సేవలందించాలి
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మె ల్యే రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం ఏరియాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పలు వార్డులు పరిశీలించి రోగులకు అందుతు న్న వసతులు గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆస్పత్రిలో పని చేస్తున్న 32 మంది వైద్యులు బాధ్యతతో పని చేసి ఆస్పత్రికి మంచిపేరు తేవాలని సూ చించారు. సమస్యలుంటే తనకు తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రో గులను కొందరు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది సరికా దని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతమైతే వారిపై ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని హె చ్చరించారు. ఆస్పత్రిలో వాహనాల పార్కింగ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment