పట్టపగలే చోరీ
ముధోల్: మండల కేంద్రంలోని సాయిమాధవ్‌నగర్‌లో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. డి.సాయినాథ్, భార్య అమృత దంపతులు. సాయినాథ్ టైలర్‌గా, అమృత అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. సాయినాథ్ బై క్‌పై తన భార్యను మధ్యాహ్నం 12 గంటలకు అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో లగ్జరీ ఖరీదు చేసే కారులో వచ్చిన దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టారు. లోనికి చొరబడి 4 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ. 40 వేల నగదును ఎత్తుకెళ్తి పారిపోయారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు భార్యభర్తలకు వచ్చి చూ సేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఈవిషయాన్ని ఎస్సై సంజీవ్‌కు సమాచారం అందించారు. ఆయనతోపాటు సీఐ మల్లేశ్, క్లూస్‌టీం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ సిబ్బందితో తనిఖీ చేశారు. సాయినాథ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment