ఎడ్లబండిపై ఊరేగించి..వీడ్కోలు పలికి
● హెచ్‌ఎంకు వీడ్కోలు పలికిన అర్లి (టి) విద్యార్థులు
తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి) పాఠశాల హెచ్‌ఎం శ్రీధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం హెచ్‌ఎం దంపతులను ఎడ్లబండిపై ఊరేగించి వీడ్కోలు పలికారు. హెచ్‌ఎం పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. పిల్లల అభ్యున్నతికి హెచ్‌ఎం కృషిచేశారని, ఆయన సేవలను కొనియాడారు. వీడ్కోలు కార్యక్రమంలో పాఠశాలకు హెచ్‌ఎం..తన వంతుగా రూ.2 లక్షల విలువ గల కంప్యూటర్, వాటర్ కూలర్‌తో పాటు ఆర్వో ప్లాంట్, సౌండ్ సిస్టం విరాళంగా అందించారు. పలువురు విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ సైతం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment