గ్రామసభల్లో అర్హులను గుర్తించాలి
కుంటాల: ప్రభుత్వ పథకాల అమలు కోసం మండలంలోని ఆయా గ్రామాల్లో ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్న గ్రామసభల్లో అర్హులను గుర్తించాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక రైతు వేదికలో గ్రామసభ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీవో లింబాద్రి, డీటీ నరేష్‌గౌడ్, ఎంపీవో రహీంఖాన్, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment