‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతిలో ఉత్తమ ఫలితా లు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలాని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షలపై సంబంధిత శాఖల అధి కారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి కూడా నంబర్ వన్‌గా నిలవాలన్నారు. గణితం, ఇంగ్లిష్, సైన్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌ల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిరంతరం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. అనంతరం పాఠశాలల వారీగా పదో తరగతి విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు పూర్తి చేసిన సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పరీక్షలకు సన్నద్ధమవుతున్న వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్, అంబాజీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు పద్మ, సలోమి కరుణ, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలి..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదా ల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లపై ప్రమాదకర మలుపులు, బ్రేక్ డౌన్ ప్రాంతాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సరైన స్థితిలో పని చేస్తున్నాయో లేదో పరిశీలించాలన్నారు. ప్రధాన రహదారుల వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అధిక వేగంతో వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలి పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను అధికారులకు వివరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పరేడ్ నిర్వహనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నా రు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్‌ను ఏర్పా టు చేయాలన్నారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని స్వాతంత్ర సమరయోధులను, ప్రముఖులను వేడుకలకు ఆహ్వానించాలన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిశోర్‌కుమార్, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment