పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు
నిర్మల్‌టౌన్: నిర్మల్ లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు పేద విద్యార్థులకు సోమవారం ఫీజులు చెల్లించారు. ఎల్‌కేజీ చదువుతున్న విగ్నేష్‌కు రూ.5వేలు, తొమ్మిదో తరగతి చదువుతున్న వర్షినికి రూ.6వేలు, ఎల్.ఎన్ శంకర్‌రావు అందజేశారు. ఒకటో తరగతి చదువుతున్న సిద్ధార్థకు రూ.4,500 కంటి వైద్య సహాయక నిపుణులు రవికుమార్‌రెడ్డి, శరణ్యకు శ్రీనివాస్‌గుప్తా రూ.5వేలు, ఎల్‌కేజీ చదువుతున్న కృతిక్ నందన్‌కు రూ.4,500 శ్రీనివాస్‌యాదవ్ అందించి మానవత్వం చాటుకన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానాచార్యులు కట్ట రేఖ వారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment