సీఎంఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరాపై సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం, పూర్తిచేసిన సరఫరా, నిల్వ ఉన్న ధాన్యం, రోజువారీగా తరలిస్తున్న ధాన్యపు లారీల వివరాలను మిల్లర్ల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ సరఫరాలో వేగం పెంచాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు క్షేత్ర స్థాయిలో మిల్లులను తనిఖీ చేసి రోజువారీ నివేదికలను అందజేయాలన్నారు. సమావేశంలో డీఎస్వో కిరణ్ కుమార్, డీఎం సివిల్ సప్లయ్ వేణుగోపాల్, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment