కేంద్ర పథకాలు ప్రతీ ఇంటికి చేరాలి
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా పనిచేయాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు అంజికుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించారన్నారు. రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, సంవిధాన్ అభియాన్ కార్యక్రమ జిల్లా కన్వీనర్ సామ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసమ్మె రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment