‘ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ అమలు చేయాలి’
నిర్మల్‌చైన్‌గేట్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ కార్యాలయంలో సోమవారం టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలో 18 ఏళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కొంతమంది నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2018 సెప్టెంబర్ 18న 12(3)పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం పర్మినెంట్ చేసుకునే వెసులు బాటు కల్పి స్తూ తీర్పు వెలువరించిందన్నారు. ఐదుగురు చే యాల్సిన పనిని ఇద్దరితో చేయిస్తున్నారని వాపోయారు. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం 8 గంటల షిఫ్ట్ డ్యూటీ, వారాంతపు సెలవు, ఓవర్ టైం వేతనం ఇవ్వాలని ఉన్నప్పటికీ ఇవ్వ డంలేదన్నారు. దీక్షలో మధు, కృష్ణ, వసీం, అశ్వక్, శ్రీనివాస్, పోశెట్టి, మధు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment