బ్యాంకుల భద్రతకు పటిష్టమైన చర్యలు
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: బ్యాంకులు, ఏటీఎంల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో అన్ని బ్యాంకుల అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు వారి పరిధిలోని బ్యాంకులను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. బ్యాంకు పరిసర చెట్టు ప్రాంతాలను, లాకర్లను, వాటి పనితీరును పరిశీలించాలన్నారు. బ్యాంక్ అధికారులు ప్రతీరోజు బ్యాంకు మూసే ముందు లాకర్లు, అలారం సిస్టమ్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ శాఖ అనునిత్యం బ్యాంకర్లకు అందుబాటులో ఉండి భద్రత చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకుల పరిధిలో ఏమైనా భద్రత సమస్యలు తలెత్తితే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, రాజేష్ మీనా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment