నిర్మల్‌రూరల్: ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత ఉపాధ్యాయులకు జీవో 317 బదిలీలకు పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగా అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఒక్కరు బదిలీ కాగా ఇతర జిల్లాల నుండి నిర్మల్‌కు 9 మంది బదిలీపై రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు యోగితా రానా ఉత్తర్వులు జారీ చేశారు. 317 జీవోలో భాగంగా ఉపాధ్యాయులు ఇష్టం లేకపోయినా ఇతర జిల్లాలకు మూడేళ్ల క్రితం స్థానికతను వదిలి బదిలీపై వెళ్లారు. కుటుంబాలకు దూరంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన జీవో 317కు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి సమస్యలు తీర్చేందుకు ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు దఫాలుగా క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించిన అనంతరం మొదటగా 317 స్పాజ్ ఉపాధ్యాయ బదిలీలకు అనుమతించింది. 15 రోజుల క్రితం దరఖాస్తులు స్వీకరించగా సంక్రాంతి సెలవుల అనంతరం ప్రభుత్వం వారిని బదిలీ చేస్తూ తాజాగా సోమవారం రాత్రి జాబితాను విడుదల చేసింది. వీరు మంగళవారం తమకు కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment