నిర్మల్
ప్రణాళికతో విజయం
పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
మెరుగైన వైద్యం అందించాలి
● డీసీహెచ్‌ఎస్ సురేశ్
భైంసాటౌన్: వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ఐదు పడకల డయాలసిస్ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఓపీ, ఆర్థో సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎక్స్‌రే, స్కానింగ్ సేవలను 24 గంటలు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు ఉన్నారు.
నిర్మల్:
‘సార్.. నెలలు గడిచిపోవట్టే మాకింకెప్పుడు రుణమాఫీ చేస్తరు...!? అని కుంటాల మండలం ఓలాలో రైతులు ప్రశ్నించారు.
‘ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నం. ఇప్పుడన్న వస్తాయన్న ఆశతో ఉంటే.. మా పేర్లు లేవంటున్నరు. మాకెందుకు రేషన్‌కార్డులివ్వరో చెప్పండి..!?’అని లక్ష్మణచాంద మండలం చింతలచాందలో దరఖాస్తుదారులు నిలదీశారు.
‘అన్ని అర్హతలు ఉన్నా రేషన్‌కార్డు జాబితాలో మాపేర్లు ఎందుకు రాలేదో చెప్పండి..’ అంటూ సారంగపూర్ మండలం మలక్‌చించోలిలో ఏకంగా ఆందోళన వ్యక్తంచేశారు.
జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో తొలిరోజు గ్రామ/వార్డు సభలు వాడీవేడిగానే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఊహించినట్లే గ్రామసభల్లో దరఖాస్తుల రాతలతోపాటు పథకాలపై నిలదీతలూ ఎదురవుతున్నాయి. ప్రధానంగా రుణమాఫీ, రేషన్ కార్డులు రానివాళ్ల ఆక్రోషాన్ని అధికారులు ఎదుర్కోక తప్పని పరిస్థితి.
అర్హతలు ఉన్నా ఇవ్వరా...?
‘సర్కారు నౌకరీ ఉన్నోళ్లకు రుణమాఫీ చేసిండ్రు, రేషన్ కార్డులు ఇస్తుండ్రు.. అన్ని అర్హతలున్న మాకేమో ఏమిస్తలేరు.. ఇదెక్కడి న్యాయం..’ అన్న ప్రశ్నలు చాలా గ్రామసభల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రూ.2 లక్షల వరకు చేసిన రుణమాఫీలో చాలామంది అర్హతలు ఉన్నా.. నిబంధనల ప్రకారం లేకపోవడంతో లబ్ధి పొందలేకపోయారు. కుటుంబంలో ఇద్దరిపై రుణం ఉండి, వారిద్దరూ ఒకే రేషన్‌కార్డులో ఉన్నా.. వారికి మాఫీ కాలేదు. పెళ్లి చేసుకుని వేరు కాపురాలు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్న కుటుంబాల్లో చాలామందికి రేషన్ కార్డులు రాలేదు. ఇలాంటివన్నీ ఇప్పుడు గ్రామసభల్లో ప్రశ్నలుగా మారుతున్నాయి.
‘ప్రజాపాలన’లనే ఇచ్చినం కదా..
‘కొత్త సర్కారు అచ్చినంక పెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలనే మాకేం లేవో అన్నీ చెప్పినం. దరఖాస్తులనూ ఇచ్చినం. ఇప్పుడు మల్లా గ్రామసభల దరఖాస్తు పెట్టుమంటున్నరు. ఇట్ల ఎన్నిసార్లు చెప్పుమంటరు సార్’అని గ్రామాల్లో పలువురు ప్రశ్నించడం కనిపించింది. కొత్తపథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభల ఉద్దేశం క్షేత్రస్థాయి వరకూ చేరలేదన్న విషయం ఈ ప్రశ్నల ద్వారా స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెల్ల కాగితం మీదే దరఖాస్తు..
గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి చాలాచోట్ల తెల్లకాగితాలను ఇచ్చి రాసివ్వమని చెప్పారు. గ్రామాలల్లో ఏం రాయాలో, ఎలా రాయాలో తెలియక తొలిరోజు చాలామంది ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఉన్నవాళ్లను రాసివ్వమని బతిమాలడం కనిపించింది. ఈ విషయాన్ని జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని బాగులవాడలో వార్డుసభ పరిశీలనకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ ఓ ఫార్మట్ రూపంలో అందిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంతోపాలు పలు గ్రామాల్లో కలెక్టర్ అభిలాషఅభినవ్, అడిషనల్ కలెక్టర్లు గ్రామసభలను పరిశీలించారు.
న్యూస్‌రీల్
పథకాలపై గ్రామసభలు షురూ..
తొలిరోజు పలుచోట్ల వ్యతిరేకతలు
‘రేషన్‌కార్డులు’ జాబితాపై ఆగ్రహం
తెల్లకాగితంపై దరఖాస్తులతో ఇబ్బంది
పరిశీలిస్తామన్న జిల్లా అధికారులు
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
నిర్మల్‌చైన్‌గేట్: సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నాయిడివాడ, నిర్మల్ గ్రామీణ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన వార్డు, గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని ప్రజలకు, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత(రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి వివరించారు. అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందన్నారు. సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని, పంటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుకు ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తుందన్నారు. సాగుభూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో రూ.12 వేలు అందించడం జరుగుతుందని వివరించారు. ఎలాంటి సాగు భూమి లేకుండా, కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామన్నారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోనివారితోపాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుంచి కూడా అర్జీలు స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమాలలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఎస్‌వో కిరణ్‌కుమార్, తహసీల్దార్లు రాజు, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment