గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలి
● ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు సూచించారు. బీఆర్.అంబేద్కర్ సచి వాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజు గుర్తించిన లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 తేదీ వరకు గ్రామ సభలు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పథకాల అమలుపై ప్రజ లకు ఉన్న అపోహలు తొలగించాలని మంత్రులు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభలు నిర్వహించామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో జిప్రసాద్, డీపీవో శ్రీనివాస్, డీఎస్‌వో కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment