క్రీడోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ
నిర్మల్‌చైన్‌గేట్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవ్ – 2025 పోస్టర్లను స్థానిక ఎస్‌ఎస్‌ఆర్, సిద్ధార్థ ఒకేషనల్ జూని యర్ కళాశాల్లో మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విభాగ్ ఎస్‌ఎఫ్‌ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రమశిక్షణ, పోరాటపటిమ, జట్టు స్ఫూర్తి, సమరసత భావనలను అభివృద్ధి చేసేలా క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ఖేలో భారత్ పేరుతో దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ, గెలుపోటములను పరిచయం చేయడంతోపాటు వారి జీవిత లక్ష్యాలను సాధించడమే ఈ క్రీడోత్సవ్ లక్ష్యమన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల సందర్భంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కళాశాల, పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విభాగ్ హాస్టల్ కన్వీనర్ ఆకాశ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ వంశీ, జగదీశ్, కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్‌రెడ్డి, సందీప్, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment