వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
సారంగపూర్: పదో తరగతితోపాటు ఇతర తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి వారిని ప్రోత్సహించాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని చించోలి(బి) గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను సోమవారం పరిశీలించారు. పదో విద్యార్థులను వివిధ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజనం సమయంలో ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థుల ఎస్ఏ–1 పరీక్షల మార్కులను డిస్ప్లే చేసి వాటి ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. సీ–గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని త్వరలో నే బి–గ్రేడ్‌కు తీసుకురావడానికి కృషిచేయాలన్నారు. అభ్యాస దీపికలు విద్యార్థులు పూర్తి చేసేలా ప్రోత్సహించాలన్నారు. సందేహాలు నివృత్తి చేస్తూ పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు. ఫలితాల్లో పాఠశాలను నంబర్ వన్ గా నిలపాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment