నిర్మల్
‘ఉపాధి’లో పొలంబాట
ఉపాధిహామీ పథకంలో పొలాల బాటలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో రైతులు ఇబ్బందులు తీరనున్నాయి.
మంగళవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2025
8లోu
నిర్మల్: మున్సిపాలిటీలలో పాలకవర్గాల పాలన ముగిసింది. సోమవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీలకు కలిపి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఆయన ఆయా మున్సిపాలిటీల్లో బాధ్యతలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న పనులు, అడుగడుగునా సమస్యలు, తీర్చేందుకు నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న బల్దియాలను ఆయన ఒక్కరే ఎలా సమన్వయం చేస్తారు.. సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది సవాల్‌గా మారింది. మరోవైపు సవాలక్ష రాజకీయాలతో ఐదేళ్లు తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, స్పెషల్ ఆఫీసర్ అయినా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాకు మెడల్స్ తీసుకురావాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మెడల్స్ తీసుకురావాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. కరీంనగర్లో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించే పోలీస్ స్టేట్‌మీట్ స్పోర్ట్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులను సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. స్పోర్ట్స్ మీట్‌కు 16 మంది క్రీడాకారులు వెళ్తున్నారు. వీరు జిల్లాలో నిర్వహించిన క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చి స్టేట్ మీట్‌కు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, రాజేశ్‌మీనా తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌లో కోట్లుపెట్టి నిర్మించిన ఫుట్‌పాత్ దుస్థితి
నిర్మల్ మున్సిపాలిటీలో..
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment