![గంగారెడ్డికి నియామకపత్రం అందజేస్తున్న
ఎన్నికల అధికారి మురళి - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/15nzt706-250041_mr_0.jpg.webp?itok=--nfJIWO)
గంగారెడ్డికి నియామకపత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి మురళి
మోపాల్: మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) చైర్మన్‌గా ముల్లంగి గ్రామానికి చెందిన గ్యానాజి గంగారెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్టార్ మురళి గంగారెడ్డికి నియామకపత్రం అందజేశారు. సొసైటీ చైర్మన్ పదవికి ఉమాపతిరావు రాజీనామా చేయడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. 11 మంది డైరెక్టర్ల మద్దతుతో గ్యానాజి గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సింగిల్ నామినేషన్..
మోపాల్ చైర్మన్ పదవికి శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. తొలుత 9 మంది డైరెక్టర్లతో కలిసి పదవిని ఆశిస్తున్న గ్యానాజి గంగారెడ్డి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. గంగారెడ్డిని డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, నరేందర్ ప్రతిపాదించారు. అనంతరం నామినేషన్ల స్క్రూటినీ చేశారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎన్నికల అధికారి మురళి గంగారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమని ప్రకటించారు. ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. గంగారెడ్డి ఎన్నికతో మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. గంగారెడ్డికి పీసీసీ ప్రధానకార్యదర్శి కాట్‌పల్లి నగేష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఎల్లోల సాయిరెడ్డి, పోలసాని శ్రీనివాస్, రాంచంద్ర గౌడ్, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్‌సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. వైస్ చైర్మన్ సుమన్‌రెడ్డి, డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, అంగల లక్ష్మీ, గంగమణి పాల్గొన్నారు.
సొసైటీ బలోపేతానికి కృషి
డైరెక్టర్లు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో సొసైటీ బలోపేతానికి కృషి చేస్తాను. నా ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లు, రూరల్ ఎమ్మెల్యే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డికి ధన్యవాదాలు. రాబోయే ధాన్యం సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతాం.
– గంగారెడ్డి, చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment