![పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nzt241-250035_mr-1739216884-0.jpg.webp?itok=PRIrN9L6)
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నిజామాబాద్‌అర్బన్/బోధన్ టౌన్: గ్రామ పంచా యతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూ చించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్‌ల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో, బోధన్ డివిజన్ అధికారులకు బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం వేర్వేరు గా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ప్రతి రోజూ డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్‌ల ప్రక్రియను వీడియో తీయించాలన్నారు. నామినేషన్‌ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా సాగే అవకాశం ఉంటుందన్నారు. నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్‌ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
శిక్షణ తరగతుల్లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, డీఎల్‌పీవోలు, ఆర్‌వోలు, సహాయ ఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి డైలీ రిపోర్టు పంపించాలి
రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్
అధికారుల శిక్షణ తరగతుల్లో
కలెక్టర్ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment