![దారులన్నీ కుంభమేళా వైపే..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10arm07-250003_mr-1739216885-0.jpg.webp?itok=TCL8o-ff)
దారులన్నీ కుంభమేళా వైపే..
ఆర్మూర్: మహాకుంభ మేళాకు జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. మహా కుంభమేళాలో అమృతస్నానం ఆచరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల వాహనాలు లైన్ కట్టాయి. 990 కిలోమీటర్ల దూరంలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న భక్తులు త్రివేణి సంగమంలో అమృతస్నానానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక పర్యటనగా మార్చుకుంటున్నారు. అయోధ్య, కాశీ, చిత్రూ ట్, మైహర్ శక్తిపీఠంను దర్శించుకుంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళా ఈనెల 26 నాటితో ముగియనుంది. గత నెల 29న మౌని అమావాస్య, ఈ నెల 3న వసంత పంచమి సందర్భంగా కోట్లాది మంది తరలి వస్తారనే సమాచారం ఉండటంతో.. ఈ పర్వదినాల అనంతరం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుంభ మేళాకు వెళ్లడం ప్రారంభించారు. మరో 15 రోజు ల్లో మహా కుంభమేళా ముగియనుంది. లక్షలాది వాహనాలు ప్రయాగ్‌రాజ్‌కు క్యూ కట్టడంతో మధ్యప్రదేశ్‌లో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది. మరో వైపు 44వ, 30వ నంబర్ జాతీ య రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు లెక్కకు మించిన వాహనాలు చేరుకుంటుండడంతో అధికారులు మధ్యప్రదేశ్‌లో రహదారులపైనే వాహనాలను నిలిపి వేస్తున్నట్లు సమాచారం. కుంభమేళాలో రద్దీని పంపించి వేసిన అనంతరమే అక్కడి అధికారుల సమాచారం మేరకు మధ్య ప్రదేశ్ నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో జిల్లా నుంచి బయల్దేరిన వారు 18 నుంచి 20 గంటల్లో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవాల్సి ఉండగా ట్రాఫిక్ జామ్ కారణంగా 40 గంటలకుపైగా సమయం పడుతోంది. మార్గ మధ్యలో సదుపాయాలు అందుబాటులో లేవనే సమాచారం ముందుగానే ఉండటంతో మినీ బస్సుల్లో వెళ్లే జిల్లా వాసులు మార్గమధ్యలో వంటలు వండుకోవడానికి సైతం ఏర్పాట్లు చేసుకొని యాత్రకు బయల్దేరుతున్నారు. మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం ఈ తరానికి చెందిన తమ అదృష్టంగా భావిస్తూ వ్యయప్రయాసలకోర్చి ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు.
జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు
ట్రాఫిక్ జామ్‌తో ఇక్కట్లు..
అధిగమిస్తూ పయనం
15 రోజుల్లో ముగియనున్న
ఆధ్యాత్మిక జాతర
Comments
Please login to add a commentAdd a comment