ఫీజు బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Published Sat, Oct 19 2024 12:12 AM | Last Updated on Sat, Oct 19 2024 12:12 AM

ఫీజు

తెయూ(డిచ్‌పల్లి): గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్‌ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్‌ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. బకాయిలు పెరిగిపోవడంతో అటు కళాశాలలను నడపలేని స్ధితిలో ఉన్నామని ప్రైవేటు యాజమాన్యాలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి న విషయం తెలిసిందేనన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు.నాయకులు అమృతచారి, అజయ్‌,లెనిన్‌,శ్రీకాంత్‌,శేఖర్‌,తరుణ్‌ పాల్గొన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

సిరికొండ: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి అరవింద్‌ ప్రజలకు సూచించారు. మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో డెంగీ సోకిన రోగుల ఇళ్ల వద్ద శుక్రవారం ఆయన లార్వా సర్వే నిర్వహించారు. పరిసరాల్లో డెమోపాస్‌, పైరీత్రం మందులను పిచికా రీ చేయించారు. సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్లు మండోదరి, నిర్మలాదేవి, రమేష్‌, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, కారోబార్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన

ధర్పల్లి: మండల కేంద్రంతోపాటు గోవింద్‌పల్లి, ఇంద్రనగర్‌ తండాలోని అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఎంపీడీవో బాలకృష్ణ పరిశీలించారు. పిల్లలకు, గర్భిణులకు నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందియాలని ఆయన సిబ్బందికి సూచించారు. అంగన్వాడి కేంద్రాల వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు.

పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఖలీల్‌వాడి: కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటుహక్కు నమోదు చేసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌మోహన్‌ గౌడ్‌ కోరారు. నగరంలోని బార్‌ సమావేశపుహాల్‌లో శుక్రవారం ఆయన సీనియర్‌ న్యాయవాదులతో కలిసి ఓటరు నమోదు దరఖాస్తులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా విలువైనదని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకుని మిగితా వారిని ఓటు అనే యజ్ఞంలో భాగస్వాములని చేయాలని తెలిపారు. న్యాయవాదులు ఆకుల రమేశ్‌, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్‌ రావు, నీలకంఠ రావు, రాజ్‌ కుమార్‌ సుభేదార్‌, విక్రమ్‌ రెడ్డి, జె.వెంకటేశ్వర్‌, గడుగు గంగాధర్‌, విద్యావేత్త హరికృష్ణరెడ్డి ఉన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ సిటీ: జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మహాసభల పోస్టర్లను సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ.. ఐద్వా 4వ రాష్ట్ర మహాసభ భద్రాద్రి కొత్తగూడెంలో త్వరలో జరగనున్నట్లు తెలిపారు. సభలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావాలని కోరారు. వనజ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఫీజు బకాయిలు  విడుదల చేయాలి 
1
1/3

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

ఫీజు బకాయిలు  విడుదల చేయాలి 
2
2/3

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

ఫీజు బకాయిలు  విడుదల చేయాలి 
3
3/3

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement