వైద్యం ఖరీదైంది | - | Sakshi
Sakshi News home page

వైద్యం ఖరీదైంది

Published Sat, Nov 2 2024 1:48 AM | Last Updated on Sat, Nov 2 2024 1:48 AM

వైద్య

వైద్యం ఖరీదైంది

నిజామాబాద్‌

గత పాలనలోనే కష్టాలు

గత ప్రభుత్వమే విద్యుత్‌ రంగాన్ని విధ్వంసం చేసిందని రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి అన్నారు.

శనివారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

– 8లో u

నిజామాబాద్‌నాగారం: జిల్లాలో ప్రయివేట్‌ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ అంటూ పేర్లు పెట్టి కనీస నిబంధలు పాటించకుండానే ఆస్పత్రులు నడిపిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి వివిధ చికిత్సలకు ధరల పట్టికలు పెట్టడం లేదు. ప్యాకేజీల పేరిట పెద్ద ఎత్తున రోగుల వద్ద వసూళ్లు చేస్తున్నారు. మనిషి చచ్చినా, బతికినా సంబంధం లేదు. ప్యాకేజీ ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందే... కనీస పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

అవసరం లేకున్నా టెస్ట్‌లు..

జిల్లాలో ప్రయివేట్‌ ఆస్పత్రులకు కొదువ లేదు. ముఖ్యంగా నగరంలో ఖలీల్‌వాడీ, ప్రగతినగర్‌, ద్వారకానగర్‌, హైద్రాబాద్‌రోడ్‌, వినాయక్‌నగర్‌, కంఠేశ్వర్‌రోడ్‌, బోధన్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లోనే సుమారు 650 వరకు ప్రయివేట్‌ ఆస్పత్రులున్నాయి. ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. మండల కేంద్రాలో రెండు, మూడు ఆస్పత్రులు వెలిశాయి. గత దశాబ్దకాలంగా ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కమర్షియల్‌గా మారిపోయాయి. ఇందులో భాగంగానే ప్రయివేట్‌ వ్యక్తులు ముగ్గురు, నలుగురు కలిసి మల్టీస్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ పేర్లతో ఆస్పత్రులు నడిపిస్తున్నారు. కొంతమంది వైద్యులు సైతం ఇదే బాట పట్టారు. జిల్లాలో వైద్యం చాలా ఖరీదై పోతోంది. ఆస్పత్రులకు అనుగుణంగానే ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతూ ప్రయివేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తే చాలు.. అనవసర టెస్ట్‌లు కూడా చేస్తూ దండుకుంటున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి.

రోగం నయం కాకున్నా..

చాలా ఆస్పత్రుల్లో ఎవరైనా డెలివరీకి వచ్చినా, పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడినా, యాక్సిడెంట్లు, ఇతరత్రా అనారోగ్యలకు గురైనా నిర్వాహకులు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ప్యాకేజీలు రూ. 40 వేల నుంచి రూ. లక్షల్లో ఉంటున్నాయి. అడ్వాన్సులు తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. ప్యాకేజీలు మాట్లాడిన తర్వాతా రోగులు బతికినా, చచ్చినా సరే మొత్తం డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగం వచ్చిన వారికి పూర్తిగా నయం కాకన్నా సరే ప్యాకేజీలు మాత్రం చెల్లించాల్సిందే.

న్యూస్‌రీల్‌

కనిపించని ధర పట్టికలు..

నందిపేట్‌ మండలానికి చెందిన రాములు (పేరు మార్చాం) కడుపు నొప్పి భరించలేక ఆర్‌ఎంపీ వద్ద చూపించుకున్నాడు. సీరియస్‌గా ఉందని నగరంలోని ఫలానా ఆస్పత్రికి వెళ్తే రూ.40 వేల ప్యాకేజీలో కడుపు నొప్పి ఆపరేషన్‌ చేసి, మందులతో పాటు రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తారని చెప్పారు. రాములు ఆర్‌ఎంపీ సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లి కడుపు నొప్పి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. వాస్తవానికి రూ. 15 వేల లోపు కడుపు నొప్పి ఆపరేషన్‌ చేస్తారు. కాగా రూ. 40 వేల ప్యాకేజీలో ఆర్‌ఎంపీకి కమీషన్‌ ఉంటుంది. ఇలా రోగులను అటు ఆస్పత్రులు, రిఫరెన్స్‌ ఇచ్చిన ఆర్‌ఎంపీలు దోచుకుంటున్నారు.

ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన సుజాత (పేరు మార్చాం) డెలివరీ కోసం నగరంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి వచ్చారు. ప్రతి నెల వచ్చి గైనిక్‌ డాక్టర్‌ వద్ద చూపించుకున్నారు. అయినా సరే నెలలు నిండగానే కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, పాప, తల్లి ప్రాణాలకు ముప్పుందని ఆస్పత్రిలోని యాజామాన్యాలు భయపెట్టడంతో ప్యాకేజీ కింద సీజేరియన్‌ ఆపరేషన్‌కు రూ. 60 వేలకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో

ప్యాకేజీ పేరిట వసూళ్లు

రోగం చిన్నదైనా, పెద్దదైనా

పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే..

ఆస్పత్రులకు రిఫరెన్స్‌ ఇస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు.. తద్వారా కమీషన్లు

పర్యవేక్షణ మరిచిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో, ల్యాబ్‌లలో కచ్చితంగా ధరల పట్టిక ప్రదర్శించాల్సిందే. ఏ చికిత్సకు ఎంత తీసుకుంటున్నారో పట్టికలో తెలపాలి. పదుల సంఖ్యలో మాత్రమే గైనిక్‌ ఆస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీ, సిజేరియన్‌ డెలివరీలకు సంబంధించి ధరల పట్టిక బోర్డులు ఉన్నాయి. మిగతా ఆస్పత్రుల్లో ఎక్కడ కూడా కనిపించవు. అడ్మిషన్‌ ఫీజు రూ. 300 నుంచి రూ.500 వరకు ఇష్టారీతిన తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రులను పర్యవేక్షణ చేయాల్సిన వైద్యారోగ్యశాఖాధికారులు తమకేమి పట్ట నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యా దులు చేస్తే పరిశీలిస్తామని చెబుతూ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కచ్చితంగా ధరల పట్టిక ప్రదర్శించాల్సిందే. ఇది వరకే సమీక్షలు పెట్టి మరీ ఆదేశాలు ఇచ్చాం. ప్యాకేజీల విషయం నా దష్టికి వచ్చింది. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే పరీశీలించి కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ రాజశ్రీ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
వైద్యం ఖరీదైంది1
1/3

వైద్యం ఖరీదైంది

వైద్యం ఖరీదైంది2
2/3

వైద్యం ఖరీదైంది

వైద్యం ఖరీదైంది3
3/3

వైద్యం ఖరీదైంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement