పదిలో ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని పదవ తరగతి లో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేందు కు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా ఉ మ్మడి పరీక్షల విభాగం రూపొందించిన ప్రత్యే క ప్రణాళికను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ షె డ్యూల్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు విద్యా బోధన, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలల్లో 12,162 మంది, ప్రయివేట్ పాఠశాలల్లో 11,673 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.
ప్రత్యేక ప్రణాళిక ఇలా..
ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను బోధిస్తారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు హాజరయ్యేటట్లు చూడాలి. ఇందుకోసం ప్రత్యేక రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక తరగతులకు సంబంధించి నోట్స్ తయారు చేసుకునే విధంగా చూడాలి. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతి గురించి తెలియజేయాలి. ప్రత్యేక బోధన సమయంలో రెగ్యులర్ బోధన నిర్వహించకూడదు. ప్రత్యేక తరగతులలో బోధించిన అంశాలపై విషయాల వారీగా స్లిప్ టెస్టులు నిర్వహించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిరంతరం పర్యవేక్షించాలి. ప్రశ్న పత్రాలను విశ్లేషించి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయాలి. పాఠ్యపుస్తకంలోని అన్ని అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగు సూచనలతో మెరుగుపరచాలి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఈ ప్రణాళిక అమలులో ఉంటుంది. డీఈవో దుర్గప్రసాద్ మాట్లాడుతూ పదో తరగతిలో గతంలో కంటే మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక ప్రణాళిక విడుదల చేసిన విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment