కల్లాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
కామారెడ్డి గాంధీ గంజ్‌లో వర్షానికి తడిసిన ధాన్యం
● తుపాను ప్రభావంతో వర్షం ● కొనుగోళ్లు మొదలుకాక రైతులకు అవస్థలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుపాను ప్రభావంతో కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం వర్షం కురిసింది. కామారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, లింగంపేట, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో కురిసిన భారీ వర్షంతో ధాన్యం నానిపోయింది. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడిన తర్వాత చేతికొచ్చిన పంట వర్షార్పణం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న జాప్యం రైతులకు శాపంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment