సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం

Published Sat, Nov 2 2024 1:48 AM | Last Updated on Sat, Nov 2 2024 1:48 AM

సమగ్ర

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం

ఇళ్ల వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు

ప్రతి కుటుంబ వివరాలు పక్కగా

సేకరించాలని ఆదేశాలు

బోధన్‌లో హౌస్‌ లిస్టింగ్‌ను పరిశీలించిన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

నిజామాబాద్‌అర్బన్‌: సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అయ్యింది. ఈనెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సర్వేకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా హౌస్‌ లిస్టింగ్‌ సర్వేను ప్రారంభించారు. అనంతరం ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభం కానుంది

సమగ్ర వివరాల కోసం

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతిరోజు ఒక ఉద్యోగి 10 ఇళ్ల కుటుంబ వివరాలను నమోదు చేయాలి. కుటుంబంలోని సంఖ్య, కులము, నివాస గృహాలు, మోటార్‌ వాహనాలు, వ్యవసాయ, ఉద్యోగి వివరాలు ఆడ, మగ ఇలాంటి పూర్తి వివరాలను సేకరిస్తారు. జిల్లాలోని 1178 మంది ఆశా కార్యకర్తలు, 2175 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 536 పంచాయతీరాజ్‌ సెక్రెటరీలను సర్వేకు కేటా యించారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన టీచర్లను కూడా సర్వేకు వినియోగిస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బోధన్‌లో పర్యటిస్తూ ఇళ్ల జాబితాల రూపకల్పన ప్రక్రియను పరిశీలించారు. బోధన్‌ పట్టణంలోని రాకాసిపేటతో పాటు లంగ్డాపూర్‌ గ్రామంలో అధికారులు, సిబ్బంది జిల్లా జాబితా రూప కల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్‌ తెలుసున్నారు. ఇళ్ల పై సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అతికిస్తుండగా వాటిపై నమోదు చేస్తున్న వివరాలను కలెక్టర్‌ పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఏ ఒక్క నివాస గృహం వదలకుండా హౌస్‌ లిస్టింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్‌ పట్టణ పరిధిలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సర్వే కోసం ఎన్యు మరేషన్‌ బ్లాక్‌లోని ప్రతి ఇంటికి క్రమ సంఖ్యను కేటాయించారు. ఇళ్ల జాబితా పక్కగా రూపొందితే సర్వే సక్రమంగా చేపట్టవచ్చునని అధికారులు భావిస్తున్నా రు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ మూడు రోజుల్లోపు హౌస్‌లిస్టింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఎక్కడ కూడా డూప్లికేషన్‌ లేకుండా హౌస్‌ లిస్టింగ్‌ చేసి ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుకు పూర్తిస్థాలో ఇప్పటికే ఆవగహన కార్యక్రమాలను నిర్వహించారు.

టీచర్లకు విధుల కేటాయింపు

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, ప్రధానోపాధ్యాయులకు ఈ సర్వేలో విధులను కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో 1263 మంది ఆశా కార్యకర్తలు, 2153 మంది అంగన్వాడీ టీచర్లు, 537 మంది పంచాయతీరాజ్‌ సెక్రెటరీలను సర్వేకు కేటాయించారు. వీరికి అదనంగా టీచర్లను కూడా కేటాయిస్తూ పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ బుర్ర వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే టీచర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల బోధన చేప ట్టి, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సమగ్రా కుటుంబ సర్వేలో పాల్గొననున్నారు. ఒకవేళ ఒక పాఠశాలలో ఒకే టీచర్‌ ఉంటే సమీప పాఠశాల టీచర్లను విధులకు కేటాయించనున్నారు. ఇలా విద్య బోధనకు ఆటంకం లేకుండా కేవలం ప్రాథమిక పాఠశాల టీచర్లకు మాత్రమే విధులు కేటాయించారు. ఉన్నత పాఠశాలలో పని చేసే టీచర్లకు విధులు కేటయించలేదు.

కాగా సమగ్రా కుటుంబ సర్వేలో ప్రభుత్వ టీచర్లు కూడా పాల్గొంటారని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. సర్వేను పక్కగా చేపడతామని, ఇది వరకే ఏర్పాట్లు కూడా చేశామని కలెక్టర్‌ ‘సాక్షి’ కి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం1
1/1

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement