బాల్య వివాహాలను అరికట్టాలి
డిచ్‌పల్లి: బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ జ్యోత్స్నదేవి అన్నారు. మండలంలోని మెంట్రాజ్‌పల్లి గ్రామంలో సోమవారం జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అనాథ పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరమని తెలిపారు. అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మహిళలు రాణించాలని పేర్కొన్నారు. బాలల హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లితే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సూపర్ వైజర్ బీక్ సింగ్, అంగన్ వాడీ టీచర్లు సునిత, శమంత, రేణ పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ
మోపాల్: మండల కేంద్రంలో సోమవారం ఎస్‌హెచ్‌వో యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 20 మందికి రూ.2500 జరిమానాలు విధించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.
మోపాల్‌లో గ్రామసభ
మోపాల్: మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం జాతీయ ఉపాధిహామీ పథకం పనుల ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఉపాధిహామీ ఏపీవో సునీత, టెక్నికల్ అసిస్టెంట్ సరిత పాల్గొని మాట్లాడారు. గ్రామంలో 2025–26 సంవత్సరానికి ఈత వనాలు, హార్టికల్చర్, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, తదితర పనులు చేపట్టాలని తెలిపారు. జీపీ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
నిజామాబాద్ రూరల్: మండలంలో ఈనెల 6నుంచి జరిగే ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ అనిరుధ్, ఎంపీడీవో సుబ్రమణ్యం అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల కార్యదర్శులతో, స్థానిక ఉపాధ్యాయులతో సోమవారం వారు జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యదర్శులతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసుకుంటూ సర్వే కొనసాగించాలన్నారు. సర్వేకు సంబంధించిన నిబంధనలు, సూచనలు ఉపాధ్యాయులకు, కార్యదర్శులకు తెలియజేశారు.
ఓపెన్ జిమ్ ప్రారంభం
మోపాల్: నిజామాబాద్ ఐదో డివిజన్‌లోని బోర్గాం (పి) శ్రీసాయి లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేసిన ’ఓపెన్ జిమ్’ను స్థానిక కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతేకాకుండా కాలనీ వాసులు అందరూ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ జిమ్ సేవలను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. కాలనీ అభివృద్ధికి సహకరించిన ఎంపీ అర్వింద్ ధర్మపురికి, కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డికి కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఈగ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, కోశాధికారి వినోద్, కాలనీ సభ్యులు బంటు దాసు, సందీప్, రజిన్, చంద్రు నాయక్, కిషన్, పల్లె శీను, శ్రీధర్, నాగప్ప, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన సర్వేతో దేశానికే
రోల్ మోడల్‌గా నిలుస్తాం
నిజామాబాద్ సిటీ: రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన సర్వేతో దేశానికే రోల్ మోడల్‌గా మారుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో సమ గ్ర కులగణన అనేది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. కులగణనతో ప్రజల స్థితిగతులపై మెగా హెల్త్ చెకప్ వంటిదన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే పరిస్థితిని కల్పిద్దామన్నారు. సామాజిక, ఆర్థిక, కుల సర్వేతో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూ త కల్పించడం జరుగుతుందన్నారు. గాంధీ కు టుంబం మాటంటే మాటేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర ఉన్నదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మల్లికార్జున ఖర్గే, రా హుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి, ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment