ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
డిచ్‌పల్లి/జక్రాన్‌పల్లి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండల కేంద్రాల్లో సోమవారం ఆయన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తుందన్నారు. గత పాలకులకు కులగణన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈనెల 6న చేపట్టే సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే పూర్తయిన వెంటనే డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ిపీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, మోత్కూరి నవీన్ గౌడ్, డీసీసీ డెలిగేట్ సుధాకర్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, రాజన్న, కంచెట్టి గంగాధర్, పోలసని శ్రీనివాస్, శాదుల్ల, ధర్మగౌడ్, వాసు, శామ్సన్, రాజేశ్వర్, మోహన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు రామచందర్ గౌడ్, చింతల కిషన్, చిన్న సాయి రెడ్డి, నిట్ శేఖర్, బాలకిషన్, నర్సారెడ్డి, వినోద్, లక్ష్మణ్, అరుణ్, విఠల్ పాల్గొన్నారు.
ఖిల్లా రామాలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలి
డిచ్‌పల్లి: అపురూప శిల్పకళా నిలయంగా చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. టూరిజం అండ్ ఎండోమెంట్ అధికారులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా బాసర జ్ఞానసరస్వతి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యలో డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, రూరల్ మండలం మల్కాపూర్ వద్ద గల అనంత పద్మనాభస్వామిఆలయం, అలాగే ప్రాజెక్టు రామడుగును సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య, నేతలు అమృతాపూర్ గంగాధర్, చిన్నోల్ల నర్సయ్య, మునిపల్లి సాయిరెడ్డి పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
పలు గ్రామాల్లో లబ్ధిదారులకు
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment