ఉద్యోగులు సమయపాలన పాటించాలి
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సమయపాలన పాటించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సూచించారు. ఈమేరకు సోమవారం సర్కులర్ జారీచేశారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10.30గం.ల లోపు కార్యాలయానికి చేరుకోవాలని, విధిగా రిజిస్టర్‌లో సంతకం చేయాలన్నారు. ఉదయం డ్యూటీలో ఉన్నవారు మధ్యాహ్నం 3గం.లకు తప్పకుండా సంతకం చేయాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన రిజిస్టర్ మేనేజర్ జనార్దన్ వద్ద ఉంటుందని, క్రమం తప్పకుండా కార్పొరేషన్‌లో పనిచేసేవారు డ్యూటీకి రాగానే ముందుగా రిజిస్టర్‌లో సంతకం చేయాలన్నారు. అటెండెన్స్ ప్రకారమే వారి జీతాలు చెల్లించడం జరుగుతుందన్నారు. పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో పనిచేవారు సైతం రిజిస్టర్‌లో సంతకం చేయాలని ఆదేశించారు.
కమిషనర్‌ను కలిసిన రిటైర్డు ఉద్యోగులు
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో న గర మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను సోమ వారం రిటైర్డు ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం నాయకులు రవీందర్, భోజాగౌడ్, ఆశయ్య, జగత్‌రెడ్డి, గంగారాం, రాజేశ్వరన్, దయాకర్‌రావు, మురారి, స్వామిదాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment