వైద్యుల నిర్లక్ష్యమే కారణం!
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల ఓ ప్రవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గుండెపోటుతో మరణించాడని మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుల్జాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ (40) ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరా రు. మహేందర్ కు వైద్యులు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్ట్‌లో ఎలాంటి గుండెపోటు లేదని వై ద్యులు నిర్ధారించారు. అయితే సోమవారం రాత్రి వర కు అందరితో మాట్లాడిన మహేందర్ ఆదే రోజు అర్ధరాత్రి మృతి చెందారు. వైద్యులు సడెన్‌గా స్టోక్ రావడంతో మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టౌన్ సీఐ శ్రీనివాసరాజు, ఎస్సైలు యాసీన్ ఆరాఫత్, శ్రీకాంత్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. బంధువులు ఆందోళన విరమించారు.
ప్రయివేట్ ఆస్పత్రి ఎదుట మృతుని
బంధువుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment