ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణ, ప్రమాద బీమా
డొంకేశ్వర్(ఆర్మూర్): బ్యాంకు లింకేజీ ద్వారా రుణం పొందిన మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమాతో పాటు ప్రమాద బీమాను సైతం రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తోందని జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయా మండలాల ఏపీఎంలు, సీపీలకు బీమాపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. గతంలో సీ్త్రనిధి ద్వారా రుణం పొందిన వారికే బీమా ఉండేదని, ఇప్పటి నుంచి ఎస్‌హెచ్‌జీ ద్వారా బ్యాంకు రుణం పొందిన వారికి కూడా వర్తిస్తుందన్నారు. రుణం పొందిన సభ్యులు ఏ విధంగా మరణించినా మిగిలిన అప్పును ఏజెన్సీ బాధ్యతలు చూస్తున్న సీ్త్రనిధి చెల్లిస్తుందన్నారు. అదే విధంగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండి రుణం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల బీమా డబ్బులు కుటుంబంలో నామినీగా ఉన్న వారికి వస్తాయన్నారు. రుణ, ప్రమాద బీమాకు ప్రభుత్వ మే ప్రీమి యం చెల్లిస్తుందని తెలిపారు. ఈ విష యాన్ని మహిళా సంఘాల సభ్యులకు తెలుపాలన్నారు. అనంతరం బీమాను ఏవిధంగా క్లెయి మ్ చేయాలో అవగాహన కల్పించారు. ఏపీడీ రవీందర్, సీ్త్రనిధి ఆర్‌ఎం రాందాస్, డీపీఎంలు నీలిమ, సంధ్యారాణి, మారుతి పాల్గొన్నారు.
రూ.10లక్షల బీమా వర్తింపు
ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment