పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

Published Wed, Nov 6 2024 1:36 AM | Last Updated on Wed, Nov 6 2024 1:36 AM

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌: పెండింగ్‌లో ఉన్న డీఏతోపాటు అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్‌లో తపస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తన మద్దతు ప్రకటించి ప్రసంగించారు. ప్రభుత్వం టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత కొంత కాలంగా నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పెండింగ్‌, బిల్లులు, సరెండర్‌ బిల్లులను విడుదల చేయడంతోపాటు పీఆర్సీని అ మలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో తపస్‌ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్‌, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్‌, వరప్రసా ద్‌, నాయకులు రాఘవేందర్‌, కిషన్‌రెడ్డి, మధుసూదన్‌, శ్రీనివాస్‌, నారాయణ, ప్రభాకర్‌, రాజకుమా ర్‌, నరోత్తం, రమాదేవి, స్వప్న, లహరి, కవిత, మీన తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement